Degree: డిగ్రీ యాజమాన్య కోటా సీట్లు ఇక కన్వీనర్ ద్వారా భర్తీ
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర అక్టోబర్ 7న జీవో 55 జారీ చేశారు. అన్ ఎయిడెడ్‌తోపాటు ఎయిడెడ్ కాలేజీల్లో అన్ ఎయిడెడ్ సెక్షన్లలోని బీ కేటగిరీ సీట్లు కూడా ఇదే విధానంలో కన్వీనర్ ద్వారా భర్తీ కానున్నాయి. జీవో 34 ప్రకారం మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన బీ కేటగిరీ సీట్లను విద్యార్థులకు కేటాయించనున్నారు. గతంలో ఈ సీట్లను కాలేజీల యాజమాన్యాలు భర్తీ చేయగా మెరిట్, రిజర్వేషన్లను పట్టించుకోకపోవడంతో అర్హులకు అన్యాయం జరిగేది. దీన్ని నివారిస్తూ మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేలా ఈ సీట్లను కన్వీనర్ ద్వారా భర్తీ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయా కాలేజీల్లోని వివిధ కోర్సుల సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ), 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ)కిందకు వస్తాయి. 2020 నుంచి డిగ్రీ కాలేజీల అడ్మిషన్లను ప్రభుత్వం ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీ కేటగిరీ సీట్లను కూడా ఆన్ లైన్లో అర్హులైన విద్యార్థులకు కేటాయించనున్నారు. బీ కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించిన విధివిధానాలను ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల్లో పొందుపరిచింది.
చదవండి:
అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
భారీ సంఖ్యలో ఐబీపీఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం