B Arch: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే..
ఈ విషయాన్ని ఏపీ బి.ఆర్క్ ప్రవేశాల కన్వీనర్, డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి సెప్టెంబర్ 7న తెలిపారు. 2022–23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ లేదా డిప్లొమా(10+3) పూర్తి చేసి.. నాటా(నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్), జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్లు, ఫీజుల చెల్లింపు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(AU)లో 44 సీట్లు, గుంటూరులోని ANU కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో 44 సీట్లు, విశాఖలోని వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో 32 సీట్లు, భీమవరంలోని ఎం.ఆర్.కె.కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో 16 సీట్లు, కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో 44 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
చదవండి:
NATA-2022: బీఆర్క్ పూర్తి చేసుకుంటే.. రూ.5లక్షల వేతనంతో కొలువు..