NMMS పరీక్ష ప్రాథమిక కీ విడుదల
Sakshi Education
పార్వతీపురంటౌన్: డిసెంబర్ 3వ తేదీన నిర్వహించిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ప్రాథమిక కీ విడుదల చేసినట్లు డీఈఓ ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఈ పరీక్షకు 1413మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా వారిలో 1375మంది (97)శాతం హాజరయ్యారని తెలిపారు. ప్రాథమిక కీని డిసెంబర్ 4వ తేదీన విడుదల చేసి కార్యాలయం వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఉంచారన్నారు. ఈ ప్రాథమిక కీ విషయంలో అభ్యంతరాలుంటే డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5గంటల లోపు కార్యాలయం వెబ్‌సైల్‌లో గల గ్రీవెన్స్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
చదవండి:
Scholarship: ప్రతిభకు ప్రోత్సాహం
Scholarship: విద్యార్థులకు ఆర్థిక భరోసా
Government Scholarship Scheme: విద్యార్థుల ప్రతిభకు ఎన్ఎంఎంఎస్ పథకం
Published date : 07 Dec 2023 10:48AM