Skip to main content

NMC: ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్‌.. ప్రతిపాదించిన షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, అమరావతి: దేశంలో వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సంస్కరణలు చేపడుతోంది.
NMC
ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్‌.. ప్రతిపాదించిన షెడ్యూల్‌ ఇదే..

ఇందులో భాగంగా ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం విద్యార్థులకు నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌(నెక్ట్స్‌) నిర్వహించనుంది. 2023లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులతోనే నెక్ట్స్‌ ప్రారంభించనున్నారు. దీనిని స్టెప్‌–1, స్టెప్‌–2గా రెండు పరీక్షలుగా నిర్వహిస్తారు. ఎంబీబీఎస్‌ పాస్‌కు, మెడికల్‌ ప్రాక్టీస్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు ఈ పరీక్ష ఉతీ­్తర్ణత తప్పనిసరి. దీంతో పాటు పీజీ మెడికల్‌ సీటులో ప్రవేశాలకూ ఈ  అర్హతే ఆధారం కానుంది. విదేశాల్లో చదివిన వారికి కూడా ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఇస్తారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో నెక్ట్స్‌పై అవగాహన కల్పించడం కోసం జూలై 28న స్టెప్‌–1 మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు.

చదవండి: 331 Jobs: వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ

మాక్‌ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలు దరఖాస్తుకు చివరి గడువు. ఢిల్లీ ఎయిమ్స్‌ ఆధ్వర్యంలో మాక్‌ టెస్టు నిర్వహిస్తారు. https://www.aiimsexams.ac.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ అందుబాటులో ఉంచారు. జనరల్‌/ఓబీసీ విద్యార్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు రూ. వెయ్యి దరఖాస్తు రుసుము చెల్లించాలి. వికలాంగులకు దరఖాస్తు రుసుము మినహాయించారు. మూడు స్టేజ్‌లలో మాక్‌ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. 

చదవండి: NMC: వైద్య విద్యార్థుల‌కు కీల‌క అప్డేట్‌... ఈ ఎగ్జామ్ పూర్తి చేసిన‌వారికే లైసెన్స్‌

మూడు రోజులు స్టెప్‌–1

స్టెప్‌–1 పరీక్షను మూడు రోజులు నిర్వహించాలని ఎన్‌ఎంసీ ప్రతి­పా­దించింది. పూర్తిగా మల్టిపుల్‌ చాయిస్‌(ఎంసీక్యూ) విధానంలో స్టెప్‌–1లో ఆరు పేపర్లు ఉంటాయి. రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తారు.  స్టెప్‌–1 అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్‌లో ఉత్తీ ర్ణులవ్వాలి. వీరికి హౌస్‌ సర్జన్‌ చేయడానికి అర్హత ఉంటుంది. హౌస్‌ సర్జన్‌ అనంతరం స్టెప్‌–2 పరీక్ష ఉంటుంది.   స్టెప్‌–1లోని ఆరు సబ్జెక్ట్‌లతో పాటు ఆర్థోపెడిక్స్, ఫిజికల్‌ మెడిసిన్‌ రీహబిలిటేషన్‌ (పీఎంఆర్‌)లో ఎవల్యూషన్‌ మెథడ్‌లో క్లినికల్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

చదవండి: National Medical Commission: ఇన్ని లక్షల జనాభాకు.. ఓ మెడికల్‌ కాలేజీ

ఏటా నెక్ట్స్, ఇతర ఎంబీబీఎస్‌ విద్యపై నీట్‌ ప్రతిపాదించిన షెడ్యూల్‌

కార్యక్రమం

నిర్వహణ

ఫలితాలు వెల్లడి/ముగింపు

నెక్ట్స్‌ స్టెప్‌–1

మే/నవంబర్‌

జూన్‌ మొదటి వారం/ డిసెంబర్‌

3ఎంబీబీఎస్‌/
ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌–2
ప్రాక్టికల్స్‌/ క్లినికల్‌
యూనివర్సిటీ పరీక్షలు

జూన్‌ మొదటి వారం/ డిసెంబర్‌

జూన్‌ మూడో వారం/ డిసెంబర్‌

ఇంటర్న్‌షిప్‌

జనవరి ఫస్ట్‌/జూలై

డిసెంబర్‌ 31/జూన్‌ 30

నెక్ట్స్‌ స్టెప్‌–2 రెగ్యులర్‌

జూన్‌ మూడో వారం/ డిసెంబర్‌

జూన్‌ నాలుగోవారం/ డిసెంబర్‌

నెక్ట్స్‌ స్టెప్‌–2 సప్లిమెంటరీ

సెప్టెంబర్‌ మొదటి వారం/ మార్చి

సెప్టెంబర్‌ మూడో వారం/ మార్చి

పీజీ అడ్మిషన్లు

మే–జూన్‌ (కౌన్సెలింగ్‌)

జూన్‌ 30

Published date : 30 Jun 2023 03:39PM

Photo Stories