Dr YSR Architecture and Fine Arts University: 31న వైఎస్‌ఆర్ ఏఎఫ్‌యూ రెండో విడత ప్రవేశాలు
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : కడప నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు రెండోవిడత కౌన్సెలింగ్ ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు ఏడీసెట్–23 కమిటీ చైర్మన్ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్, కన్వీనర్ డా. ఇ.సి.సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
మంగళవారం వైఎస్‌ఆర్ ఏఎఫ్‌యూలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎఫ్‌ఏ పెయింటింగ్, శిల్పం, యానిమేషన్, అప్‌లైడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి తొలివిడతలో హాజరుకాలేని విద్యార్థుల కోసం రెండోవిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
TSBIE: ఇంటర్‌లోనే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేలా..
ప్రవేశాలు పొందగోరు విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన పథకాల కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత కలిగిన వారందరూ కుల, ఆదాయ ధృవీకరణపత్రాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ రోజే అభ్యర్థులకు సీటు కేటాయిస్తామని తెలిపారు.
Published date : 26 Jul 2023 12:02PM