Skip to main content

Jagananna Vidya Deevena scheme: జగనన్న విద్యా దీవెనకు అమౌంట్‌ పడాలంటే.. ఈ బ్యాంకు ఖాతా ఉండాల్సిందే..

Jagananna Vidya Deevena
Jagananna Vidya Deevena

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెనకు తల్లితో పాటు విద్యార్థికి ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జె.రంగలక్ష్మిదేవి తెలిపారు.

సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ పథకం విడుదలయ్యే నిధులన్నీ తల్లుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయన్నారు. ఇకపై పథకం కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులు తమ తల్లితో పాటు ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉందన్నారు.

కొత్తగా ఓపెన్‌ చేసే ఈ ఖాతాలో విద్యార్థి ప్రాథమిక ఖాతాదారుగా, తల్లి ద్వితీయ ఖాతాదారుగా ఉండాలన్నారు. ఎస్‌సీ విద్యార్థులకు, 2022–23 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులకు ఉమ్మడి ఖాతా అవసరం లేదని జేడీ స్పష్టం చేశారు.

ఉమ్మడి ఖాతాలో ఎలాంటి డెబిట్‌ కార్డు లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉండరాదన్నారు. ఈ నెల 24వ తేదిలోగా ఉమ్మడి బ్యాంకు ఖాతాలను తెరవాలని.. వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందించాలన్నారు. ఇప్పటి వరకున్న సమాచారం మేరకు ఈ నెల 28న జగనన్న విద్యా దీవెన 4వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.

Published date : 14 Nov 2023 08:22PM

Photo Stories