APRCET: ప్రవేశ పరీక్షలు షెడ్యూల్
డిసెంబర్ 10వ తేదీ వరకు కొనసాగే ఈ పరీక్షలకు 12 వేల మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 పట్టణాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని ఏపీఆర్‌సెట్ కనీ్వనర్ వి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎస్వీయూలోని ఏపీఆర్‌సెట్ కార్యాలయంలో డిసెంబర్ 7న ఉదయం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి ప్రశ్నపత్రం కోడ్ ఎంపిక చేసి ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేశారు. ఉదయం 13 సబ్జెక్ట్‌లకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 2,188 మంది దరఖాస్తు చేయగా, 1,679 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 10 సబ్జెక్ట్‌లకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు 1,853 మంది దరఖాస్తు చేయగా, 1,503 మంది హాజరైనట్లు వి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 8 ఉదయం 12 సబ్జెక్టలకు, మధ్యాహ్నం 9 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు.
చదవండి:
ఎస్వీయూ శాస్త్రవేత్తలు కనుగొన్న మొక్క పేరు?
ఎస్వీయూ పరిశోధనలకు పేటెంట్.. నాగజెముడు, బ్రహ్మజెముడు పండ్లలో పోషక విలువలు ఉన్నట్లు గుర్తింపు