Degree Supplementary Exams : చివరిసారి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు.. ఈ విద్యార్థులకే..
Sakshi Education
తిరుపతి: ఎస్వీయూ పరిధిలో వార్షిక ప్యాటర్న్ (ఇయర్లీ ఎగ్జామ్స్ పాత పద్ధతిలో)లో పలు డిగ్రీ కోర్సుల్లో తప్పిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను చివరిసారి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దామ్లానాయక్ తెలిపారు. 1990–91 నుంచి 2014–15 వరకు డిగ్రీ పూర్తి చేసి పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు చివరి అవకాశం కల్పించినట్టు తెలిపారు.
వారు సెప్టెంబర్ 30వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఒక పేపర్‌కు రూ.2 వేలు, రెండు పేపర్లకు రూ.3 వేలు, మూడు, అంతకంటే ఎక్కువ పేపర్లు తప్పిన వారు రూ.4 వేలు చెల్లించాలని సూచించారు. దరఖాస్తులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయని, పరీక్ష ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు.
Published date : 17 Aug 2024 10:56AM
Tags
- degree supplementary
- Supplementary Exams
- SVU Tirupati
- yearly exam
- Failed Students
- Degree Students
- Controller of Examination Damlanaik
- last chance for degree supplementary
- supplementary fees
- degree supplementary applications
- Education News
- Sakshi Education News
- SupplementaryExams
- SVU
- DegreeCourses
- AnnualPattern
- DegreeFailures
- EducationUpdate
- Exam notification
- sakshieducation latest news