AnuragCET 2023 : జనవరి 29 నుంచి అనురాగ్ సెట్.. ఎలాంటి ఫీజు లేకుండానే..
గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి చూపే విద్యార్థులు తమ వర్సిటీకి వచ్చి సెట్ పరీక్ష రాయవచ్చని, ఆన్‌లైన్‌లోనూ సెట్ నిర్వహిస్తున్నామని నీలిమ తెలిపారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని వివరించారు. జనవరి 11వ తేదీన (బుధవారం) విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆమె సెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
JEE Mains 2023 : జేఈఈ అర్హతలో మార్పులు ఇవే.. ఇంటర్‌లో కూడా..
ఎలాంటి ఫీజు లేకుండానే..
ప్రవేశపరీక్షలో 1–10 ర్యాంకుల వారికి ఎలాంటి ఫీజు లేకుండానే ప్రవేశం కల్పింస్తామని, 11–25 ర్యాంకుల వారికి 50%, 26–100 లోపు ర్యాంకు వచ్చినవారికి 25% ఫీజు రాయి తీ ఉంటుందని ఆమె తెలిపారు. ఈ ఏడాది నుంచి ఎంసెట్, జేఈఈ ర్యాంకర్లకు 10–50 శాతం వరకూ ఫీజు రాయితీ ఉంటుందన్నారు. తమ వర్సిటీ జాతీయ స్థాయిలో ఫార్మసీ, ఇంజనీరింగ్‌లో 140వ ర్యాంకులో ఉందని వైస్ చాన్స్‌లర్ రామచందర్‌రావు తెలిపారు.