Skip to main content

National Testing Agency: నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ట-నెట్స్‌ 2024

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ట-నెట్స్‌ 2024 పథకానికి ఎస్సీ బాల బాలికలు నుంచి దరఖాస్తులు కోరుతోంది. శ్రేష్ట(రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ హైస్కూల్‌ ఇన్‌ టార్గెటెడ్‌ ఏరియాస్‌)-2024 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు పొందవచ్చు. శ్రేష్ట పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3000 సీట్లు భర్తీ కానున్నాయి.
Shreshta-2024 examination   3000 seats available nationwide   Students participating in Shreshta scheme  National Entrance Test for Shreshta Nets 2024 scheme    Admissions in Class 9 and 11

అర్హత: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో, పదో తరగతి చదువుతు­న్న బాలబాలికలు అర్హులు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.

పరీక్ష విధానం: పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాథమేటిక్స్‌(30 మార్కులు), సైన్స్‌ (20 మార్కులు), సోషల్‌ సైన్స్‌(25 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌/నాలెడ్జ్‌(25 మార్కులు) సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.04.2024
దరఖాస్తు సవరణ తేదీలు: 06.04.2024 నుంచి 08.04.2024.
అడ్మిట్‌ కార్డ్స్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 12.05.2024
పరీక్ష తేది: 24.05.2024 (మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు).

వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/SHRESHTA

చదవండి: TS ICET 2024 Notification: టీఎస్‌ ఐసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

Published date : 18 Mar 2024 04:15PM

Photo Stories