Top 20 Artificial Intelligence and Data Science Engineering college : బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. ఈ బ్రాంచ్‌లో చేరితే..
బీటెక్ అడ్మిషన్ల సందడి నెలకొంది! దాంతో ఏ బ్రాంచ్‌తో భవిష్యత్తు బాగుంటుంది.. నాలుగేళ్ల తర్వాత జాబ్ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్ ఉంటుంది.. ప్రస్తుతం ఎలా ఉంది.. ఏ బ్రాంచ్ ఎంచుకుంటే మంచిది.. కాలేజీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని టాప్-20 Artificial Intelligence and Data Science Engineering collegesల జాబితా మీకోసం..
The below list of Artificial Intelligence and Data Science Engineering colleges is only for reference. It is prepared based on the last ranks admitted in 2021 web based counselling.
Top 20 Engineering(AI_Data Science) Colleges in Telangana | ||||
College Code | College Name | Branch | Place | Last Rank (2021) |
CBIT | CHAITANYA BHARATHI INSTITUTE OF TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | GANDIPET | 1028 |
BVRI | B V RAJU INSTITUTE OF TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | NARSAPUR | 9127 |
MRTN | ST MARTINS ENGINEERING COLLEGE (AUTONOMOUS) | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | DHULAPALLY | 31882 |
GURU | GURU NANAK INSTITUTIONS TECHNICAL CAMPUS (AUTONOMOUS) | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | IBRAHIMPATAN | 32551 |
METH | METHODIST COLLEGE OF ENGINEERING AND TECHNOLOGY (AUTONOMOUS) | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | ABIDS | 39241 |
INDU | SRI INDU COLLEGE OF ENGG AND TECHNOLOGY (AUTONOMOUS) | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | IBRAHIMPATAN | 47756 |
INDI | SRI INDU INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY | ARTIFICIAL INTELLIGENCE AND DATA SCIENCE | IBRAHIMPATAN | 67559 |
☛ Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
ఏఐ ఉద్యోగాలు ఖాళీగానే..
వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ ఒక నివేదికలో వెల్లడించింది.
ఫ్రెషర్స్ మొదలుకుని..
వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తుండటం పెరుగుతోందని గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. ఏఐ నిపుణుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఇది డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఉండటం లేదని పేర్కొంది. దీంతో వివిధ సంస్థల్లో ఏఐ సంబంధ ఉద్యోగాలు భారీగా ఖాళీగా ఉన్నాయని వివరించింది. ఫ్రెషర్స్ మొదలుకుని మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ దాకా దేశీయంగా పలు సంస్థల్లోని ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు.