Engineering colleges Admissions : ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఇవే కీలకం..
ఈ నేపథ్యంలో.. బీటెక్ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక విశ్లేషణ మీకోసం..
Engineering college Admissions : ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
ఏఐసీటీఈ నిబంధనలు ప్రకారం..:
కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకూ.. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలి.
ఎన్‌బీఏ గుర్తింపు :
తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు సదరు కాలేజ్‌లో ఎన్‌బీఏ గుర్తింపు ఉందో లేదో కనుక్కోవాలి. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్ అంటూ.. అన్ని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కాలేజ్‌కు ఉన్న పేరును..:
గత ఏడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీలో ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంకుల వివరాలు గమనించాలి. ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు సహా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే..ఆ కళాశాలలు విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.
టీచింగ్ తీరుతెన్నులపై.. :
కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలు ఇస్తుంటాయి.
ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ పై..
కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడు గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్‌ను పరిశీలించాలి. సదరు కాలేజీకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో గమనించాలి. కొన్ని కళాశాలలు తమ కళాశాలలకు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని కలర్‌ఫుల్ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీల్లో కోర్ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇచ్చాయో తెలుసుకోవాలి. ప్రముఖ కంపెనీలు సైతం బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్ ప్రొఫైల్స్‌లో ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి. కోర్ జాబ్ ప్రొఫైల్ ఆఫర్స్ సంఖ్య 20 నుంచి 30 శాతం లోపే ఉంటోంది.
నచ్చిన బ్రాంచ్ రాకుంటే.. ఇలా..
ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా.. మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేకుంటే.. సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్‌లవైపు దృష్టిసారించొచ్చు. కోరుకున్న బ్రాంచ్‌లో సీటు లభించలేదని నిరుత్సాహానికి గురికాకూడదు.
నచ్చిన కాలేజ్ రాకుంటే..
కోరుకున్న కాలేజ్‌లో ప్రవేశం లభించకున్నా.. స్వీయ అధ్యయనం ద్వారా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈలెర్నింగ్ పోర్టల్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్‌లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ లేబొరేటరీ సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.