Skip to main content

AICTE: ఇంజనీరింగ్‌లో చేరాలంటే ఆ సబ్జెక్టులు చదివి ఉండాల్సిందే

దేశంలో అండర్‌ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలను సవరించింది.
Those subjects are a must read in order to join Engineering
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూ విధివిధానాలు ప్రకటించిన ఏఐసీటీఈ

2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త ‘అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌’ను విడుదల చేసింది. గతంలో ఏఐసీటీఈ పేర్కొన్న అర్హత నిబంధనలను పట్టించుకోకుండా యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తూ వచ్చాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు లేకున్నా ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించేలా 2021లో ఏఐసీటీఈ నిబంధనలు సవరించింది. దీనివల్ల ఈ సబ్జెక్టులతో సంబంధం లేకుండా హయ్యర్‌ సెకండరీలో నిర్ణీత అర్హత మార్కులు వచ్చిన వారందరికీ సీట్లు కేటాయించారు. హయ్యర్‌ సెకండరీ, ఇంటరీ్మడియెట్‌లో జనరల్‌ అభ్యర్థులు 45 మార్కులు, ఇతరులు 40 మార్కులు సాధిస్తే చాలు ఇంజనీరింగ్‌ కోర్సులకు అర్హులుగా పరిగణించారు. విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తప్పనిసరి ప్రవేశం ఉండాలన్న నిబంధన లేనందున సాంకేతికంగా ఆ ప్రవేశాలు చెల్లుబాటు అయ్యాయి. 

CAs

​​​​​​​ప్రమాణాలు దెబ్బతింటున్నాయని..

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో సంబంధం లేని విద్యార్థులకు ప్రవేశాలు దక్కటం వల్ల ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ముఖ్యమైన కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కమ్యూనికేషన్, మెకానికల్, ఏరోనాటికల్, ప్లానింగ్, సివిల్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్‌ సబ్జెక్టులలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమైంది. దీనిపై నీతి ఆయోగ్‌లో కూడా చర్చ జరిగింది. దీంతో ఏఐసీటీఈ గత ఏడాది పేర్కొన్న నిబంధనల సవరణను వెనక్కు తీసుకుంటూ తాజాగా విడుదల చేసిన అప్రూవల్‌ ప్రాసెస్‌ హ్యాండ్‌బుక్‌లో 29 ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు సంబంధించి తప్పనిసరి అర్హత సబ్జెక్టులను పొందుపరిచింది. వీటిలో 18 కోర్సులలో ప్రవేశించాలంటే విద్యార్థులకు ఇంటరీ్మడియెట్‌ లేదా హయ్యర్‌ సెకండరీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను తప్పనిసరి చేసింది. అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, ప్రింటింగ్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు హయ్యర్‌ సెకండరీలో మ్యాథ్స్‌ చదవకపోయినా ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఆర్కిటెక్చర్, ప్యాకేజింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు ఈ సబ్జెక్టుల కాంబినేషన్ తో ప్రమేయం లేకుండా ప్రవేశాలు కల్పించవచ్చని ఏఐసీటీఈ పేర్కొంది. దీంతోపాటు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో బహుళ ప్రవేశ, ని్రష్కమణ నిబంధనల్ని కూడా సవరించింది.

చదవండి: 

​​​​​​​బెస్ట్‌ ఇంజనీరింగ్‌కు.. బిట్‌శాట్‌

నూతన విద్యా విధానంతో ‘శాస్త్ర, సాంకేతిక’ అభివృద్ధి

కోవిడ్‌ మృతుల పిల్లలకు పాలిటెక్నిక్‌ సీట్లు

కాగా, కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చి్రల్డన్’ పథకం కింద పాలిటెక్నిక్‌ కాలేజీల్లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈ కాలేజీల్లో సూపర్‌ న్యూమరరీ సీట్లను ఈ విద్యార్థుల కోసం కేటాయిస్తారు.

Published date : 31 Mar 2022 03:34PM

Photo Stories