Skip to main content

Robot System Integration Competition: రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ

ఇండియా స్కిల్స్‌ జాతీయ స్థాయి పోటీలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు.
robo
రోబోటిక్‌ స్కిల్స్‌లో రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ

రోబోట్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేషన్ కాంపిటేషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన రవి వంశీకృష్ణ, విజయనగరానికి చెందిన వుప్పాల జగదీష్‌ మెడల్స్‌ సాధించినట్లు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకటించింది. బెంగళూరు ఐఎంటీఎంఏలో జరిగిన పోటీల్లో ఈ ఇద్దరు విద్యార్థులు అత్యంత నైపుణ్య ప్రతిభను కనబరిచారని, జనవరి10న ఢిల్లీలో మెడల్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇదే విభాగంలో ఒడిశా నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. చిందర వందరగా పడి ఉన్న వస్తువులను ఒక క్రమపద్ధతిలో అమర్చడం, ఒక వాహనం నుంచి సరుకును దింపడం, నింపడం వంటి అంశాల్లో మనుషుల సాయం లేకుండా రోబోతో చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ను ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా ఈ విద్యార్థులు మెడల్స్‌ దక్కించుకున్నారు. 

చదవండి: 

Industry 4.0: 5జీ టెక్నాలజీ.. రెండు కోట్ల కొలువులు రెడీ!

AMECA Humanoid Robot: తొలిసారి అచ్చు మనిషిలా హావభావాలు

Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక‌... రూ. 12 లక్షల వార్షిక వేతనం

Published date : 04 Jan 2022 04:11PM

Photo Stories