Engineering: ఫీజుల మోత!.. ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఇలా..
పెంచిన ఫీజులు ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. ‘రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ’ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
చదవండి: Tech skills: సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు
సగటున 20శాతం దాకా పెంపు
2019 నుంచి అమల్లో ఉన్న ఫీజులతో పోలిస్తే.. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో సగటున 20 శాతం వరకూ ఫీజులు పెరిగాయి. పెద్ద కాలేజీల్లో 10 నుంచి 15 శాతం పెంచగా.. రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు పెంచారు. రాష్ట్రంలో గరిష్టంగా మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి గరిష్టంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఇక ఎంసీఏ కోర్సుల వార్షిక ఫీజులను కనిష్టంగా రూ.27 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు.. ఎంటెక్ ఫీజులను కనిష్టంగా రూ.57 వేల నుంచి గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు పెంచారు. మొత్తం 153 కాలేజీలకు మాత్రమే ఫీజులు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతా కాలేజీల్లో కొన్నింటికి అనుబంధ గుర్తింపు రావాల్సి ఉండటంతో ఫీజుల నిర్థారణ చేయలేదని తెలిపారు.
చదవండి: TSCHE: ఇంజనీరింగ్‌కు ఇండ్రస్టియల్ లింక్
దోబూచులాట మధ్య..
టీఏఎఫ్‌ఆర్సీ మూడేళ్లకోసారి ఫీజులను సమీక్షించి.. కాలేజీల ఆదాయ, వ్యయ నివేదికల ఆధారంగా కొత్త ఫీజులను నిర్ణయిస్తుంది. ఇంతకుముందు 2019–20 విద్యా సంవత్సరంలో ఫీజులను నిర్ధారించగా 2021–22 వరకు అమల్లో ఉన్నాయి. 2022–23 నుంచి మూడేళ్లకు సంబంధించిన ఫీజులపై ఎఫ్‌ఆర్సీ కొన్నిరోజుల కింద కసరత్తు పూర్తిచేసింది. తొలుత 10 శాతం మేర ఫీజులు పెరిగే అవకాశం ఉందని కమిటీ.. తమ ప్రతిపాదిత ఫీజుల్లో కొంత తగ్గించి ఓకే చేశారని కాలేజీలు చెప్పాయి. కానీ అన్నివర్గాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ, పాత ఫీజులనే అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతున్నట్టు ఎఫ్‌ఆర్సీ వర్గాలు తెలిపాయి. దీనిపై 81 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా.. ఎఫ్‌ఆర్సీ తొలుత అంగీకరించిన ఫీజులను అమలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచి్చంది. దీంతో తొలి ఆడిటింగ్‌లో కొన్నిలోపాలు జరిగాయంటూ ఎఫ్‌ఆర్సీ మళ్లీ కాలేజీల ఆదాయ, వ్యయాలపై ఆడిట్ నిర్వహించి, మొదట అంగీకరించిన ఫీజుల్లో కోతపెట్టింది. కొన్ని కాలేజీల విజ్ఞప్తి చేయగా.. మరోసారి పరిశీలించి ఈ నెల తొలి వారంలో ఫీజుల పెంపు తుది ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది.
చదవండి: Dual Degree Courses After Inter: డ్యూయల్ డిగ్రీతో.. యూజీ + పీజీ!
40కాలేజీల్లో లక్షపైనే..
తాజా ఫీజుల పెంపును పరిశీలిస్తే.. రూ.లక్ష, ఆపైన ఫీజు ఉండే జాబితాలో ఇంతకుముందు 18 కాలేజీలుంటే.. వాటి సంఖ్య 40కి పెరిగింది. రూ.75వేలపైన వార్షిక ఫీజున్న కాలేజీలు 24 నుంచి 38కి చేరాయి. తొమ్మిది కాలేజీల్లో కనీస ఫీజు రూ.35 వేల నుంచి రూ. 45వేలకు పెరిగింది. మరో 66 కాలేజీల్లో రూ.45 వేల నుంచి రూ.75 వేల మధ్య ఫీజులు ఉండబోతున్నాయి.
చదవండి: OU: ఓయూ ఇంజినీరింగ్ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు
పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ
ఇంజనీరింగ్ ఫీజుల పెంపును ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి.నాగరాజు ఖండించారు. కరోనాతో చితికిపోయిన సామాన్యులకు ఇది నష్టం చేస్తుందని పేర్కొన్నారు. తక్షణమే పెంపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చదవండి: Artificial Intelligence: ఏఐతో సైబర్ సెక్యూరిటీకీ లాభాలు
ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఇలా..
కాలేజీ |
ఫీజు (రూ.లలో) |
ఎంజీఐటీ |
1,60,000 |
సీవీఆర్ |
1,50,000 |
సీబీఐటీ |
1,40,000 |
అనురాగ్ వర్సిటీ |
1,35,000 |
బీవీఆర్‌ఐ |
1,35,000 |
వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి |
1,35,000 |
ఎంవీఎస్‌ఆర్ |
1,30,000 |
గోకరాజు |
1,30,000 |
గురునానక్ |
1,20,000 |
మల్లారెడ్డి |
1,15,000 |
జేబీఐటీ |
1,10,000 |
కేఎంఐటీ |
1,03,000 |
నారాయణమ్మ |
1,00,000 |
మాతృశ్రీ |
1,00,000 |
భోజిరెడ్డి |
75000 |
మహవీర్ |
70,000 |
జీతాలూ సరిగా ఇవ్వని కాలేజీల్లో ఫీజుల పెంపా?
కనీస వసతులు లేని, ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా చెల్లించని కాలేజీల్లో కూడా ఫీజులు భారీగా పెంచడం దారుణం. వేతనాలు ఇవ్వడం లేదని ఉద్యోగులు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఆర్సీ చర్యలు తీసుకోలేదు. ఫీజుల పెంపు వల్ల మధ్య తరగతి కుటుంబాలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
– అయినేని సంతోష్ కుమార్, టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
పేదలకు పెనుభారమే
వృత్తివిద్య ఫీజుల పెంపు దారుణం. పేదలపై ఇది పెనుభారమే. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఉద్యమం చేపడతాం.
– ప్రవీణ్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి