Skip to main content

Engineering Seats: తేలని ‘కన్వీనర్‌’ లెక్కలు.. యాజమాన్య కోటాకు రెక్కలు!.. ఈ బ్రాంచ్‌ సీట్లు హాట్‌ కేక్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లు ఎన్నో ఇంకా లెక్క తేలలేదు. ప్రైవేటు కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్లను ఇప్పటికే దాదాపు అమ్మేసుకున్నాయి.
Engineering Seats

ఇదంతా బహిరంగ రహస్యమే. అన్నీ తెలిసినా అధికారులు తామేమీ చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలి. కానీ అనధికారికంగా కాలేజీలు బేరాలు కుదుర్చుకుని సీట్లు అమ్మేసుకుంటున్నాయి. సీట్లు ఎప్పుడో అయిపోయాయంటూ ప్రధాన ప్రైవేటు కాలేజీలు చెబుతున్నాయి. 

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

ఆగిన అనుబంధ గుర్తింపు ప్రక్రియ 

ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయనే లెక్క ఇప్పటివరకు తేలలేదు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఆగిపోవడంతో ఇప్పటివరకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ విభాగానికి సీట్ల లెక్క రాలేదు. ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లున్నాయి? ఏ కాలేజీలో ఎన్ని సెక్షన్లు, ఏయే సీట్లు లెక్క అందాల్సి ఉంది.

ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఫీడ్‌ చేయాలి. అప్పుడే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి వీలవుతుంది. అఫ్లియేషన్‌ ఇవ్వని కారణంగా సీట్ల లెక్క తెలియని నేపథ్యంలో ఈఏపీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను జూన్‌ 27 నుంచి జూలై 7కు వాయిదా వేశారు.  

చదవండి: College Predictor - 2024 AP EAPCET TS EAMCET

ఆ సీట్లన్నీ ఎప్పుడో సేల్‌ 

రాష్ట్రంలో 1.22 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ఇందులో 82 వేల వరకూ కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా సీట్లలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రవాస భారతీయుల పిల్లలకు ఎక్కువ ఫీజుతో దీన్ని కేటాయిస్తారు. మిగిలిన సగం సీట్లను ‘బి’కేటగిరీ కింద భర్తీ చేస్తారు. దీని కీ కొన్ని నిబంధనలున్నాయి. తొలుత జేఈ ఈ ర్యాంకర్లకు ప్రాధాన్యమివ్వాలి.

ఆ తర్వా త ఎంసెట్, దీని తర్వాత ఇంటర్‌ మార్కు లను బట్టి సీట్లు ఇవ్వాలి. ఇదంతా ప్రభుత్వ నోటిఫికేషన్‌ వచ్చాకే జరగాలి. కానీ కాలేజీ లు ముందే తల్లిదండ్రులతో బేరాలు కుదు ర్చుకుంటున్నాయి. అనధికారి కంగా సీట్లు ఇస్తూ డబ్బులు తీసుకుంటున్నాయి.

చదవండి: Mechanical Engineering Careers: మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయితే.. ఆ విద్యార్ధికి అపార ఉద్యోగావ‌కాలు ఇలా ఎన్నో..

నోటిఫికేషన్‌ వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామంటున్నాయి. ఈఏపీ సెట్‌ ఫలి తాలు వెల్లడై మర్నాడు నుంచే బేరసారాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాలేజీలకు వెళ్ళినా సీట్లు లేవని, కంప్యూటర్‌ సీట్ల గురించి మాట్లాడే పరిస్థితే లేదని చెబుతున్నారు.  

సాఫ్ట్‌వేర్‌ రెడీగా ఉన్నా.. 

యాజమాన్య కోటా సీట్లను ఎంబీబీఎస్‌ తరహాలో ఆన్‌లైన్‌ పద్ధతిలో భర్తీ చేయాలని కొన్నేళ్ళుగా డిమాండ్‌ వస్తోంది. ఈ ఏడాది దీనిపై కసరత్తు చేస్తున్నామని విద్యాశాఖ ముఖ్య అధికారి కూడా ఈఏపీ సెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు.

ఉన్నత విద్యా మండలికి ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ అందించేందుకు కూడా ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. కానీ దీనివల్ల తమ ఆదాయానికి గండి పడుతుందంటూ ప్రైవేటు కాలేజీలు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది.

ఈ కారణంగానే ఈ ప్రక్రియ ఆగిపోయిందని కౌన్సిల్‌ వర్గాలు అంటున్నాయి. ప్రైవేటు కాలేజీలన్నీ ప్రముఖ రాజకీయ నేతల చేతుల్లో ఉండటం వల్ల ఆన్‌లైన్‌ విధానంలో బీ కేటగిరీ సీట్ల కేటాయింపు చేపట్టాలంటే ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

సీఎస్‌ఈ బ్రాంచ్‌ హాట్‌ కేక్‌ 

ప్రధాన కాలేజీల్లో ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచి సీట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ధనవంతులైన తల్లిదండ్రులు సీట్లను ఎంతంటే అంతకు కొనేశారు. వీళ్ళలో ఎక్కువ మంది ఈఏపీ సెట్‌లో కేవలం క్వాలిఫై అయిన, ఇంటర్‌ మార్కులు అతి తక్కువగా వచ్చిన పిల్లల తల్లిదండ్రులే ఉన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ వంటి బ్రాంచీల సీట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో 58 శాతం వరకు సీట్లు ఈ బ్రాంచీల్లోనే ఉన్నాయి. ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ అంచనాలను బేరీజు వేసుకుని మరీ ప్రైవేటు కాలేజీలు సీట్లు అమ్మేసుకున్నాయి. బీ కేటగిరీ సీట్లకు ఎవరు దరఖాస్తు చేశారనే విషయంలో పారదర్శకత లేకపోవడం, ఆధారాలతో ఫిర్యాదు చేసే వారూ లేకపోవడంతో తామేమీ చేయలేమని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీల్లో ఒక్కో సీటుకు రూ.14 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు తీసుకున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలుస్తోంది.   

Published date : 27 Jun 2024 03:55PM

Photo Stories