ITI National Trade Certificate: ఐటీఐ ఎన్టీసీ పొందటానికి అవకాశం
Sakshi Education
మంచిర్యాల అర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తూ అర్హత కలిగిన ప్రైవేట్ అభ్యర్థిగా ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఎన్‌టీసీ) పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్లు మంచిర్యాల ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్ ఏప్రిల్ 16న ఓ ప్రకటనలో తెలిపారు.
ఐటీఐకి సంబంధించిన ఏదేని ట్రేడ్‌లో అనుభవమున్న అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్ పరీక్షలకు (ఆలిండియా ట్రేడ్ టెస్ట్ (ఏఐఐటీ)కు హాజరయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
చదవండి: Internship to Job: ఈ సంస్థలో ఇన్‌టర్న్‌షిప్‌తోపాటు ఉద్యోగావకాశం
ఐటీఐలో ఏదైనా ట్రేడ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలో ఎస్సెస్సీ ఉత్తీర్ణులై, మూడేళ్లు ఆయా ట్రేడ్‌లలో అనుభవం కలిగి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కలిగినవారికి ఎన్టీసీ పొందటానికి వీలుందని వివరించారు. నాలుగు కేటగిరీలకు సంబంధించిన అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీలోపు ములుగురోడ్‌లో గల కార్యాలయంలో వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌ను నేరుగా కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 17 Apr 2024 03:15PM