Skip to main content

Latest Anganwadi news: ఇకపై అంగన్‌వాడీలకు ఇవి తప్పనిసరి

Latest Anganwadi news
Latest Anganwadi news

మంచిర్యాలటౌన్‌: చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే బొమ్మలు, పాటల రూపంలో చిన్నారులకు విద్యను అందిస్తున్నారు.

ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల ద్వారా విద్యాబోధన చేపట్టనున్నారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను తప్పనిసరి. ఈ క్రమంలో కొత్త రకం పాఠ్యపుస్తకాలను రూపొందించారు. ఇందులో వారంలో ఏమేమి బోధించాలి, ఈ నెలలో ఏయే పాఠ్యాంశాలను చెప్పాలనే ప్రణాళికను సైతం అందులో ముద్రించింది.


Good News For Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ భారీగా నిధులు...

టీచర్లకు శిక్షణ..

నూతన విద్యాభోధనకు అనుగుణంగానే చిన్నారులకు పాఠాలు చెప్పేలా అంగన్‌వాడీ టీచర్లకు మూ డు రోజులు శిక్షణ ఇచ్చారు. ప్రతీ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి నుంచి ఇద్దరు సూపర్‌వైజర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చిన అనంతరం, వారితోనే ఆయా ప్రా జెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లను 30 నుంచి 35 మందిని ఒక బ్యాచ్‌గా చేసి, మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు.

చిన్నారులకు పాఠ్యాంశాల్లోని అంశాలను నిర్బంధ విద్యలా కాకుండా, ఆటాపాటలతో చిన్నారులు ఉల్లాసంగా గడుపుతూ నేర్చుకునేలా బోధించేందుకు టీచర్లకు శిక్షణ అందించారు. పౌష్టికాహారంతోపాటు, పూర్వ ప్రాథమిక విద్య అంగన్‌వాడీ కేంద్రాలలో అందనుండగా, కేంద్రాలకు వచ్చే చిన్నారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతో ప్రైవేటులో ప్లేస్కూల్స్‌కు వెళ్లే చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది.

ప్రతీ టీచర్‌ బోధించేలా....

జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 40,297 మంది చిన్నారులు ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుండగా, చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాల్సి ఉంది.

కొన్ని కేంద్రాల్లో టీచర్లు మొక్కుబడిగా చిన్నారులకు విద్యాబోధన చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈక్రమంలో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టింది. దీంతో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు విద్యాబోధన చేయాలి.

చిన్నారులకు యూనిఫాం..

నూతన విద్యావిధానంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు యూనిఫాం కూడా అందించనున్నారు. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందిస్తారు. ఇందుకు అవసరమైన వస్త్రం కూడా జిల్లాకు చేరింది. వీటిని కుట్టించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు.

Published date : 02 Jul 2024 04:41PM

Photo Stories