Skip to main content

IITH: ఐఐటీహెచ్‌లో నేవీ ఇన్నోవేషన్‌ సెంటర్‌

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారతీయ నౌకాదళంతో ఐఐటీ (భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ) హైదరాబాద్‌ చేతులు కలిపింది.
Navy Innovation Center
ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఇండియన్‌ నేవీ వైస్‌ అడ్మిరల్‌ చీఫ్‌ ఆఫ్‌ మార్షల్‌ సందిప్‌ నైతానీ

ఇండియన్‌ నేవీ వెపన్స్, ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఐఐటీహెచ్‌లో కో–డెవలప్‌మెంట్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (సీటీఐసీ)ను ప్రారంభించింది. ఇండియన్‌ నేవీకి అవసరమయ్యే ఉత్పత్తుల అభివృద్ధి కోసం జరిగే పరిశోధనలో ఈ కేంద్రం భాగస్వామిగా ఉంటుందని ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఈ సీటీఐ సెంటర్‌ను నేవీ వైస్‌ అడ్మిరల్‌ చీఫ్‌ ఆఫ్‌ మార్ష్షల్‌ సందీప్‌ నైతానీ మే 26న ప్రారంభించారు.

చదవండి: ఐఐఐటీహెచ్‌లో రూ.110 కోట్లతో ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్’

అనంతరం ఆయ న మాట్లాడుతూ ఐఐటీహెచ్‌లో నేవీ అధికారులు పీజీ కోర్సులు చేస్తున్నారన్నారు. దేశాన్ని గ్లోబల్‌ లీడర్‌గా చేసే సమర్థవంతమైన మానవవనరులను ఐఐటీహెచ్‌ తయారు చేస్తుందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. గత ఐదేళ్లలో 125కు పైగా స్టార్ట ప్‌లు, వెయ్యికి పైగా ఉద్యోగాలను సృష్టించిందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్‌ డీన్‌ ప్రొ ఫెసర్‌ చంద్రశేఖర్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఎక్కడివారికి అక్కడే తరగతులు

Published date : 27 May 2023 01:34PM

Photo Stories