ఐఐఐటీహెచ్‌లో రూ.110 కోట్లతో ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్’
Sakshi Education
రాయదుర్గం: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హై దరాబాద్‌కు అరుదైన అవకాశం లభించింది.
రూ.110 కోట్లతో డేటా డ్రైవ్ టెక్నాలజీస్‌పై టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (టీఐ హెచ్)ను ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఏ ర్పాటు చేయడానికి కేంద్ర శాస్త్ర సాంకేతికాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ కింద దీని ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 17 సంస్థల్లో ఈ టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఐఐఐటీ ఇది ఒక్కటే కావడం, అది హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీని ఎంపిక చేయడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సంయుక్తంగా గత జనవరిలో ప్రకటించిన అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ హబ్ ఉంటుంది. డేటా ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను, కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ప్రోత్సహించడంలో ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ కీలక పాత్ర పోషించనుంది. ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు నిర్ణయం సంతోషకరమని ఐఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ పీజీ నారాయణన్ అన్నారు.
Published date : 21 Aug 2020 02:27PM