TS SET-2023: టీఎస్ సెట్‌కు సిద్ధమా..!
ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్ష కోసం తెలంగాణలోని పాత పది జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే దరఖాస్తులను రిజర్వేషన్లతో సంబంధం లేకుండా జనరల్ కేటగిరికి చెందినవిగా పరిగణిస్తారు.
సబ్జెక్టులు
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్(పేపర్1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
Also read: Indian Polity Bit Bank: భారత రాజ్యాంగం ప్రకారం 'స్త్రీలను గౌరవించడం' అనేది?
అర్హత
కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్‌ఈ,ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం
కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో 50 ప్రశ్నలకు–100 మార్కులు, పేపర్–2లో 100 ప్రశ్నలకు–200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
Also read: చాప్టర్ 5 - భారతదేశం ఆధునిక ప్రపంచం
పేపర్–1
ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
పేపర్–2
ఈ పేపర్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
పేపర్–1 ప్రశ్నపత్రం అందరికి కామన్‌గా ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్చు. పేపర్–2లో మాత్రం కొన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
Also read: Indian Polity Bit Bank for Competitive Exams: ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు?
పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.01.2023
- ఎడిట్‌ఆప్షన్: 2023 ఫిబ్రవరి 6,7 తేదీల వరకు
- హాల్ టికెట్స్ డౌన్‌లోడ్: 2023 ఫిబ్రవరి చివరి వారంలో ∙పరీక్ష తేదీలు: 2023 మార్చి మొదటి లేదా రెండో వారంలో
- వెబ్‌సైట్: www.telanganaset.org