రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను (EdCET) జూలై 26న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
ఎడ్‌సెట్ పరీక్ష వివరాలు
EdCET కోసం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. పరీక్ష మొత్తం మూడు సెషన్లుగా ఉంటుందన్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, 12.30 నుంచి 2.30 గంటల వరకు మరో సెషన్, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ ఉంటుందని వెల్లడించారు. ఎవరు ఏ సెషన్ అనేది హాల్‌టికెట్‌లో స్పష్టం చేసినట్లు కన్వీనర్ తెలిపారు. ఏపీలో రెండు సెంటర్స్‌తో పాటు రెండు రాష్ట్రాల్లో మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు 90 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు.