Skip to main content

ECET: ఈ సెట్‌ టాపర్‌ల వివరాలు..

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఈసెట్‌–2021 (ఇంజనీరింగ్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌) ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు.
ECET
ఈ సెట్‌ టాపర్‌ల వివరాలు..

జేఎన్ టీయూ అనంతపురం ఆధ్వర్యంలో పరీక్షను పారదర్శకంగా చేపట్టామన్నారు. 32,318 మంది పరీక్షకు హాజరవ్వగా 29,904 మంది అర్హత సాధించారు. వీరిలో 23,431 మంది అబ్బాయిలు, 6,473 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తం 92.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 13 బ్రాంచ్లకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో 11 ఇంజినీరింగ్ స్ట్రీమ్, మిగిలిన రెండింటిలో బీఎస్సీ(మ్యాథ్స్), ఫార్మసీ ఉన్నాయి. అత్యధికంగా 10,119 మంది మెకానికల్ ఇంజనీరింగ్ పరీక్షకు హాజరవ్వగా 97.96 శాతం మంది పాసయ్యారు. కేవలం ఆరు మంది మాత్రమే సిరామిక్ టెక్నాలజీ ఆప్షన్ ను ఎంచుకున్నారు.

ఈసెట్లో విభాగాల వారీగా టాపర్స్

విద్యార్థి

బ్రాంచ్‌

గ్రామం

మిరియాల మౌనిక

అగ్రికల్చర్‌

సీతానగరం, విజయనగరం జిల్లా

పొట్టి సాయి భార్గవ

బీఎస్సీ, మ్యాథ్స్‌

అమరావతి రోడ్, గుంటూరు జిల్లా

భవనం సూర్యప్రకాశ్‌రెడ్డి

సిరామిక్‌ టెక్నాలజీ

ఇంకొల్లు, ప్రకాశం జిల్లా

జెల్లా సత్యనారాయణ

కెమికల్‌ ఇంజినీరింగ్‌

కాకినాడ, తూర్పుగోదావరి

పనస సాయి కుమార్‌

సివిల్‌ ఇంజినీరింగ్‌

పెదపల్లి, తెలంగాణ

కొప్పశెట్టి మణికంఠేశ్వరరావు

కంప్యూటర్‌ సైన్స్

ఎస్‌ రాయవరం, విశాఖపట్నం జిల్లా

కోసూరు వెంకట వర్దన్

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌

దొండపర్తి, విశాఖపట్నం జిల్లా

గంధం లతితా దేవి

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్

కాకినాడ, తూర్పుగోదావరి

పోకల భరత్‌ వంశీ

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇనిస్ట్రూమెంటేషన్

కలిదిండి, కృష్ణాజిల్లా

టి.మిన్నికేశ్వరరావు

మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సబ్బవరం, విశాఖపట్నం జిల్లా

బూర్లె అకేష్‌ కుమార్‌

మెటలార్జికల్‌ ఇంజినీరింగ్‌

ఆనందపురం, విశాఖపట్నం జిల్లా

వి.శరణ్‌

మైనింగ్‌ ఇంజినీరింగ్‌

పెదపల్లి, తెలంగాణ

చదవండి:

ఐసెట్‌లో టాపర్‌ల వివరాలు..

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల

Published date : 02 Oct 2021 02:04PM

Photo Stories