Skip to main content

ICET: ఐసెట్‌లో టాపర్‌ల వివరాలు..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌–2021 (ఇంటిగ్రేటెడ్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌) ఫలితాల్లో 91.27 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
ICET
ఐసెట్‌లో టాపర్‌ల వివరాలు..

మొత్తం 73 కేంద్రాల్లో పరీక్షకు 38,115 మంది విద్యార్థులు హాజరవ్వగా 34,789 మంది అర్హత సాధించారన్నారు. వీరిలో అబ్బాయిలు 17,678 మంది, 17,111 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంత్రి అక్టోబర్ 1న ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిదింటిని అబ్బాయిలు కైవసం చేసుకున్నట్టు చెప్పారు. అక్టోబర్ 2 నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి దసరా సెలవుల తర్వాత తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. రికార్డు స్థాయిలో రెండు వారాల్లోనే ఫలితాలను ప్రకటించామన్నారు.

పీజీ సెట్‌లో ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీలు, వాటి పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే కామన్ ఎంట్ర¯Œ్స టెస్టు నిర్వహిస్తున్నట్టు మంత్రి సురేష్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వర్సిటీలతో సంబంధం లేకుండా పీజీ సెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. ఆర్–సెట్ (రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ సెట్)ను కూడా ఒకే పరీక్షగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

ఐసెట్ తొలి పది ర్యాంకర్లు..

విద్యా ర్ధి

ర్యాంకు

మార్కులు

గ్రామం

మాలపల్లి రామకృష్ణ

1

154.6

కాపుతెంబూరు, శ్రీకాకుళం జిల్లా

బండి లోకేష్‌

2

153.3

దర్మవరం, అనంతపురం జిల్లా

తేనెల వెంకటేష్‌

3

151.3

బుచ్చన్నపేట, విజయనగరం జిల్లా

అల్లి లికిత్‌

4

150.4

తిరుపతి, చిత్తూరు జిల్లా

షేక్‌ సమీయుల్లా

5

149.7

తిరుపతి, చిత్తూరు జిల్లా

మణికంఠ కుమార్‌

6

148.08

గోరంట్ల, గుంటూరు జిల్లా

ఎంజేటి వైష్ణవి

7

148.02

తిరుపతి, చిత్తూరు జిల్లా

సందు సోమశేఖర్‌

8

147.8

దర్శి, ప్రకాశం జిల్లా

బేతి ఫణి సురేంద్ర

9

147.2

అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా

కరణం చందన

10

146.8

తిరుపతి, చిత్తూరు జిల్లా

చదవండి:

ఏపీ నిట్‌లో ఎంబీఏకు నోటిఫికేషన్..సీట్లు వివరాలు..

ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

Published date : 02 Oct 2021 01:48PM

Photo Stories