Skip to main content

ECET: ఈసెట్‌ సీట్ల కేటాయింపు

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీగా డిప్లొమో అభ్యర్థులకు నిర్వహించిన ఏపీఈసెట్‌లో తొలివిడతగా 17,684 మందికి నవంబర్‌ 30న సీట్లను కేటాయించినట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
ECET
ఈసెట్‌ సీట్ల కేటాయింపు

ఈసెట్‌లో 29,904 మంది అర్హత సాధించగా 21,465 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. 21,257 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకోగా 21, 140 మంది ఆప్షన్లను నమోదు చేశారు.  370 కాలేజీల్లో ఈసెట్‌ కన్వీనర్‌ కోటాలో 40,543 సీట్లుండగా తొలివిడత కేటాయింపు అనంతరం 22,859 సీట్లు మిగిలిఉన్నాయి. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌), ఎన్సీసీ విభాగాల నుంచి మెరిట్‌ జాబితా రానందున స్పోర్ట్స్‌ కేటగిరీలో 183 సీట్లు, ఎ¯ŒSసీసీ కేటగిరీలో 366 సీట్లు పెండింగ్‌లో పెట్టారు. 

చదవండి: 

Education: 100% గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

Good News: స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆమోదం

పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదు: సీఎం ట్వీట్‌

Published date : 01 Dec 2021 03:24PM

Photo Stories