AP ECET 2024: ఈ–సెట్‌కు 35వేల దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీలో 2024–25 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో సెకండియర్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈ–సెట్ 2024కు 35,038 దరఖాస్తులు అందాయి.
ఏప్రిల్ 22వరకు రూ.500, 29 వరకు రూ.2వేలు, మే 5వ తేదీ వరకు రూ.5వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పిస్తోంది.
చదవండి: Mock Test for Students: సాక్షి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ టెస్ట్.. ఎప్పుడు..?
మే 8వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటలకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 25, 26, 27 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పుల సవరణ చేసుకోవచ్చని సూచిస్తోంది.
Published date : 16 Apr 2024 01:19PM