TS Eamcet 2024: మే రెండో వారంలో ఎంసెట్ పరీక్ష..?
ప్రవేశ పరీక్ష తేదీలను తొందరలో ప్రకటించనున్నారు. మొత్తం ఏడు పరీక్షలకు ఎంసెట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన కాలపట్టికకు సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 24వ తేదీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే రెండో వారంలో ఎంసెట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పీఈసెట్, పీజీఈసెట్‌లు మాత్రం మే చివరి నుంచి జూన్ మొదటి వారంలో జరగనున్నట్లు తెలిసింది.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎంసెట్‌తోపాటు ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్‌లకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు. ఈసెట్‌ను మాత్రం మే మొదటి వారంలో నిర్వహిస్తారు. మరోవైపు పీజీ ఇంజినీరింగ్ సెట్‌లో ఈసారి పరీక్ష విధానాన్ని మార్చాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫారసు చేసింది.