Skip to main content

TS EAPCET 2024 : ఇకపై తెలంగాణ‌లో కూడా 'ఎంసెట్' కాదు.. EAPCET..? కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్‌, ఫార్మ‌సీ, న‌ర్సింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ఎంసెట్ పేరు ఇక నుంచి మార్చ‌బోతుంది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రంలో TS EAMCET పేరును TS EAPCET లేదా TS EACETగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎంసెట్‌లో మెడిక‌ల్ లేక‌పోవ‌డంతో.. M అనే అక్ష‌రాన్ని తొల‌గించాల‌ని అధికారులు ప్ర‌తిపాదించారు.
TS EAMCET transformation    ts eamcet name changed as ts eapcet details   Change from TS EAMCET to TS EAPCET

దీనికి కారణం 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్‌, ఇతర వైద్య కోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటికీ ఎంసెట్‌ పేరులో మెడికల్‌ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్‌ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంసెట్ పేరును APEAPCET గా మార్చిన విషయం తెలిసిందే.

☛ JEE Main Session 2 New Exam Dates 2024 : జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ప‌రీక్ష తేదీల్లో మార్పులు.. ఎందుకంటే..?

తెలంగాణ‌లో మే నెలో ఎంసెట్‌..?

ts eamcet latest news telugu

తెలంగాణ‌లో ఇంటర్‌ పరీక్షల తేదీలు వెల్లడవ్వడంతో ఎంసెట్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు. సాధారణంగా ఎంసెట్‌ పరీక్షల తేదీలను ఇంటర్, జేఈఈ మెయిన్స్‌ తేదీలను బట్టి నిర్ణయిస్తారు. ఇంటర్‌ పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయి. జేఈఈ ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మే నెలలో ఎంసెట్‌ నిర్వహణ సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది జేఎన్‌టీయూహెచ్‌కు ఎంసెట్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది. అయితే, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సీజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి, ఎంసెట్‌ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది.

చదవండి: JEE Success Tips : జేఈఈ మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌ రాసే విద్యార్థుల‌కు నా స‌ల‌హా ఇదే..

Published date : 17 Jan 2024 11:12AM

Photo Stories