Skip to main content

10034 New Engineering Colleges Seats in TS : కొత్తగా మ‌రో 10,034 ఇంజినీరింగ్ సీట్ల‌కు అనుమ‌తి.. ఎక్కువ‌గా ఈ కోటా కిందనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా 10,034 ఇంజ‌నీరింగ్‌ సీట్లకు ప్ర‌భుత్వం అనుమతి తెలిపింది.
Engineering seat distribution for Telangana EAMCET counselling  Total seats available in Telangana EAMCET second phase  Government announces 10,034 new engineering seats  Engineering seats allocation for Telangana EAMCET second roundNew Engineering Colleges Seats 2024 Telangana EAMCET engineering seats update

వీటిల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా కింద 7,024 సీట్లను రెండోవిడత కౌన్సెలింగ్‌లో చేర్చారు. మొదటివిడతలో మిగిలిపోయిన 22,753 కలిపి మొత్తం 29,777 సీట్లు రెండోవిడతలో అందుబాటులోకి వచ్చాయి.

 TSCHE Chairman Interview on EAMCET Counselling: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై టీఎస్సీహెచ్ఈ చైర్మ‌న్ సూచ‌న‌లు..

వీటికి జులై 27, 28న వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మెరుగైన సీట్లు, కళాశాలల కోసం తొలి విడతలో సీట్లు పొందిన వారు సైతం పోటీ పడొచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. కన్వీనర్, బీ కేటగిరీ కలుపుకొని రాష్ట్రంలోని 176 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో మొత్తం బీటెక్‌ సీట్ల సంఖ్య 1,11,480కి చేరింది. అందులో కన్వీనర్‌ కోటా కింద 85,718 సీట్లున్నాయి. గత ఏడాది మొత్తం సీట్లు 1,10,069.

Published date : 29 Jul 2024 09:09AM

Photo Stories