Skip to main content

TS EAPCET 2024: ఈఏపీ సెట్‌లో విద్యార్థుల ప్రతిభ

ఆదిలాబాద్‌ టౌన్‌: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్‌–2024 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
TS EAPCET 2024   Top Scorers of EAP Set-2024 from Adilabad District

ఆదిలాబాద్‌ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన రాహుల్‌ రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు సాధించారు. 160 మార్కులకుగానూ 132.87 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. రాంనగర్‌కు చెందిన ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి మధుకర్‌–నంద దంపతుల కూతురు వర్ణతేజ 720 వ ర్యాంకు సాధించింది. 160 మార్కులకు గాను 100.55 మార్కులు సాధించి సత్తా చాటింది.

చదవండి: Best Branch In Engineering 2024 : ఇంజ‌నీరింగ్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే..కెరీర్ బెస్ట్‌గా ఉంటుందంటే..?

ఎస్‌ఆర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈఏపీ సెట్‌లో ప్రతిభ కనబర్చారు. దోటి అవినాష్‌ 3,210, కనక ఓం దోటి అదిత్య 6,272, అనూ 6,634, దోటి అదిత్య 7,019, దొడ్డి చందు 7,775, క్రిష్ణ 8,171తో పాటు పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. విద్యార్థులను ఎస్‌ఆర్‌ కళాశాలల జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రిన్సిపాళ్లు జైపాల్‌రెడ్డి, బ్రహ్మం, అరవింద్‌ , అధ్యాపకులు అభినందించారు.

Published date : 20 May 2024 04:14PM

Photo Stories