World Cup 2023: వరల్డ్‌కప్‌లో శ్రేయస్ సరికొత్త చరిత్ర
వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో కేవలం 67 బంతుల్లో సెంచరీ చేసిన అయ్యర్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. 2007 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్ 72 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో గిల్లీ ఆల్‌టైమ్ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ.
ICC Hall of Fame 2023: ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ