Skip to main content

India Cricket Team : టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో..

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించి అరుదైన రికార్డును త‌న ఖాతా వేసుకుంది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధికసార్లు గెలుపొందిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది.

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

టీమిండియా తర్వాత..
వన్డేల్లో లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఇది 300వ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఛేజింగ్‌లో ఇప్పటి వరకు అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్‌ నిలిచింది. లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి తదితరులు టీమిండియాను లక్ష్య ఛేదనలో మేటి జట్టుగా నిలపడంలో కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. ఈ జాబితాలో టీమిండియా తర్వాత 257 విజయాలతో ఆస్ట్రేలియా, 247 విజయాలతో వెస్టిండీస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

T20 World Cup New Rules : టి-20 వ‌ర‌ల్ట్ క‌ప్‌లో అమ‌లు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫ‌స్ట్ టైమ్‌..

అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఆటగాడిగా..

shreyas iyer

సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా.. శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా తరఫున ఈ ఏడాది అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. రాంచీ మ్యాచ్‌లో అతడు 111 బంతులు ఎదుర్కొని 15 ఫోర్ల సాయంతో 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది అయ్యర్‌కు ఇది ఐదో(వన్డేల్లో మూడు, టీ20లలో రెండు) అవార్డు. ఇక ఇప్పటి వరకు 4 ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన సూర్యకుమార్‌ యాదవ్‌.. శ్రేయస్‌ అయ్యర్‌కు గట్టిపోటీనిస్తున్నాడు.

BCCI New President : బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఈయ‌నే.. ?

Cricket New Rules : కొత్త నిబంధన ఇదే.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా..

Published date : 12 Oct 2022 07:22PM

Photo Stories