World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నోవా లైల్స్‌కు పసిడి పతకం
ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్లో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ పసిడి పతకం సాధించాడు. 26 ఏళ్ల నోవా లైల్స్ అందరికంటే వేగంగా 9.83 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి ఈ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు.
లెట్సిలె టెబోగో (బోట్స్‌వానా; 9.88 సెకన్లు) రజతం... జార్నెల్ హ్యూస్ (బ్రిటన్; 9.88 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓబ్లిక్ సెవిల్లె (జమైకా) కూడా 9.88 సెకన్లలో రేసును ముగించాడు. అయితే ఫొటో ఫినిష్ ఆధారంగా రజత, కాంస్య పతకాలను ఖరారు చేశారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జస్టిన్ గాట్లిన్ (అమెరికా) ధాటికి ఉసేన్ బోల్ట్ కాంస్య పతకంతో సరిపెట్టుకొని అదే ఏడాది ఆటకు వీడ్కోలు పలికాడు.
FIFA Women's World Cup: మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ విజేత స్పెయిన్
అనంతరం 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్రిస్టియన్ కోల్‌మన్ (అమెరికా), 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫ్రెడ్ కెర్లీ (అమెరికా) 100 మీటర్ల విభాగంలో వరల్డ్ చాంపియన్స్‌గా నిలిచారు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెడ్ కెర్లీ సెమీఫైనల్లోనే నిష్క్రమించాడు.