FIFA Women's World Cup: మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ విజేత స్పెయిన్
ఆదివారం జరిగిన మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆట 29వ నిమిషంలో ఓల్గా కర్మోనా చేసిన గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది.
World senior Shooting Championship: ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా–శివ జోడీకి స్వర్ణం
● స్వీడన్‌తో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ తరఫున 89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్ చేసి తమ జట్టును ఫైనల్‌కు చేర్చింది. 2015లో కర్లీలాయిడ్ (అమెరికా) తర్వాత ఒకే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్ చేసిన ప్లేయర్‌గా ఓల్గాకర్మోనా గుర్తింపు పొందింది.
● చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టుకు మొత్తం ఒక కోటీ 5 లక్షల డాలర్ల (రూ. 87 కోట్ల 30 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. ఇందులో 42 లక్షల 90 వేల డాలర్లు స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్యకు... 62 లక్షల 10 వేల డాలర్లు జట్టులోని సభ్యులకు (23 మందికి 2 లక్షల 70 వేల డాలర్ల చొప్పున) లభించాయి.
● ఈ విజయంతో పురుషుల, మహిళల ప్రపంచకప్ టైటిల్ గెలిచిన దేశంగా స్పెయిన్ గుర్తింపు పొందింది. స్పెయిన్ పురుషుల జట్టు 2010 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచింది.