Virat Kohli : ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లి.. అరుదైన రికార్డు సొంతం !
అదే విధంగా కోహ్లి తన టెస్ట్ కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక టెస్ట్ క్రికెట్‌లో 8 వేల పరుగుల చేసిన ఆరో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. విరాట్ కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాదించాడు. 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి సచిన్ తొలి స్ధానంలో ఉన్నాడు.
Virat Kohli: క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో.. జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నాడు?
వందో మ్యాచ్‌లో మరో రికార్డును..
అదే విధంగా కోహ్లి తప వందో మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన పాంటింగ్ 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇన్‌స్టాలో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి సెలబ్రిటి?
ఇది నాకు చాలా స్పెషల్.. : విరాట్ కోహ్లి
టెస్ట్ క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇక మొహాలీ వేదికగా జరగుతున్న టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లిను బీసీసీఐ సత్కరించింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లిను సత్కరించాడు. ద్రవిడ్ 100వ టెస్ట్ క్యాప్‌ను కోహ్లికు అందజేశాడు. ఇక బీసీసీఐ సెక్రటరీ జే షా స్టాండ్‌లో కూర్చోని ఈ సెలెబ్రేషన్స్‌ను వీక్షించారు. ఇక సెలెబ్రేషన్స్‌లో కోహ్లి భార్య అనుష్క శర్మ మెరిసింది. కోహ్లి పక్కనే ఉంటూ అతడిని అభినందించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లి.. "నా చిన్ననాటి హీరో ద్రవిడ్ నుంచి 100వ టెస్ట్ జ్ఞాపికగా క్యాప్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. నా భార్య ఇక్కడ ఉంది, నా సోదరుడు కూడా ఉన్నాడు. ముఖ్యంగా జట్టు మద్దతు లేకపోయి ఉంటే నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడేవాడని కాదు. ప్రస్తుతం మూడు ఫార్మాటాల్లో ఆడుతున్నాము. కానీ టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువకాలం ఆడడం ఎంతో మనకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. నేను మరింత కాలం జట్టుకు సేవలు అందిస్తాను. యువ క్రికెటర్‌లు టెస్టు ఫార్మాట్‌లో నేను 100 మ్యాచులు ఆడాననే విషయాన్ని తీసుకోవాలి" అని కోహ్లి పేర్కొన్నాడు.
టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్‌బై.. బీసీసీఐ స్పందన ఇదే..