Virat Kohli: క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లో.. జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోనున్నాడు?
భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ప్రపంచకప్(2021 ప్రపంచకప్) తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని సెప్టెంబర్ 16న అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు. కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు భారత్ 67 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది.
చదవండి: పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టి20 ప్రపంచకప్–2021 తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు సిద్ధం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి
ఎందుకు : పని భారం తగ్గించుకునేందుకు...