Misbah-ul-Haq: పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన ఆటగాడు?
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బా ఉల్ హఖ్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేశారు. తమను సంప్రదించకుండానే టి20 ప్రపంచకప్‌కు పాక్ జట్టును ఎంపిక చేయడంతో సెప్టెంబర్ 6న వీరిద్దరు రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్లు సక్లాయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా నియమించినట్లు పాక్ బోర్డు తెలిపింది.
పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం: తాలిబన్లు
దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ ప్రావిన్సును ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సెప్టెంబర్ 6న ప్రకటించారు. ఇప్పటివరకు తాలిబన్ల పాలనకు లొంగకుండా ఉన్నవారికి పంజ్‌షీర్ కేంద్రస్థానంగా నిలిచింది. మరోవైపు తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్ పోరాట నేతలు తోసిపుచ్చారు. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాసలేహ్, పంజ్‌షీర్ నేత అహ్మద్ మసూద్ నేతృత్వంలో ఇంతవరకు పంజ్‌షీర్‌లో దళాలు తాలిబన్లను ప్రతిఘటిస్తూ వచ్చాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రాజీనామా
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : మిస్బా ఉల్ హఖ్
ఎందుకు : తమను సంప్రదించకుండానే టి20 ప్రపంచకప్‌కు పాక్ జట్టును ఎంపిక చేయడంతో...