Skip to main content

ఇన్‌స్టాలో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి సెలబ్రిటి?

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది.
Current Affairs
సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లిని ఫాలో అవుతున్న వారి సంఖ్య మార్చి 1న 10 కోట్లు దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా సెలబ్రిటిగా, తొలి క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్స్‌ రొనాల్డో (26.60 కోట్లు), మెస్సీ (18.70 కోట్లు), నెమార్‌ (14.70 కోట్లు) తర్వాత కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఇన్‌స్టాలో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి సెలబ్రిటి?
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి
ఎక్కడ : ఆసియా ఖండం
Published date : 02 Mar 2021 06:09PM

Photo Stories