US Open Title Winner: యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ విజేతగా రాజీవ్ రామ్–జో సాలిస్‌బరీ జోడీ
శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్) ద్వయం 2 గంటల్లో 2–6, 6–3, 6–4తో బోపన్న–ఎబ్డెన్ జంటను ఓడించి వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Asian Table Tennis Championships 2023: టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టుకు కాంస్యం
తద్వారా 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్‌బరీ ద్వయం గుర్తింపు పొందింది. జాన్ డోగ్–జార్జి లాట్ (అమెరికా) జోడీ 1928, 1929, 1930లలో వరుసగా మూడేళ్లు ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. విజేత రాజీవ్–సాలిస్‌బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.