Daniil Medvedev: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్?
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 13న జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–4, 6–4తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్(సెర్బియా)పై విజయం సాధించి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో రష్యా తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో ఆటగాడిగా మెద్వెదెవ్ నిలిచాడు. చాంపియన్‌గా నిలిచిన మెద్వెదెవ్‌కు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్ జొకోవిచ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
చదవండి: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్–2021 టైటిల్ విజేత?
2021లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ను జొకోవిచ్ కైవసం చేసుకున్న విషయం విదితమే. తాజా ఫలితంతో ఒకే ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్) టైటిల్స్ గెలిచి చివరిదైన యూఎస్ ఓపెన్‌లో ఓడిపోయిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ తన పేరు నమోదు చేసుకున్నాడు. గతంలో జాక్ క్రాఫోర్డ్ (1933లో), లె హోడ్ (1956లో)లకు ఇలాంటి ఫలితం ఎదురైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ చాంపియన్?
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : డానిల్ మెద్వెదెవ్ (రష్యా)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : ఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–4, 6–4తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌పై విజయం సాధించినందున...