Carlos Alcaraz: యుఎస్ ఓపెన్ పురుషుల విజేత అల్కరాజ్
Sakshi Education
![Carlos Alcaraz](/sites/default/files/images/2022/09/23/carlos-alcaraz-1663934448.jpg)
ప్రపంచ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడు ఈ స్పెయిన్ యువ సంచలనం.. కార్లోస్ అల్కరాజ్. యుఎస్ ఓపెన్ ను చేజిక్కించుకుని తన గ్రాండ్ స్లామ్ టైటిళ్ల వేటను ఘనంగా ఆరంభించాడు. అల్కరాజ్ ఫైనల్లో 6-4, 2-6, 7-6(7-1),6-3తో కాస్పర్‌రూడ్ (నార్వే)పై విజయం సాధించాడు. కెరీర్‌లో కేవలం రెండో పూర్తి స్థాయి సీజన్ మాత్రమే ఆడుతున్న అతడు.. లీటన్ హెవిట్(20 ఏళ్ల 9 నెలలు, 2001)ను అధిగమించి.. అత్యంత పిన్నవయసు పురుషుల సింగిల్స్ నంబర్ వన్ గా నిలిచాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అగ్రస్థానం సాధించిన తొలి టీనేజర్ అల్కరాజే.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 23 Sep 2022 05:30PM