Skip to main content

Tokyo Paralympics 2020: తొలి స్థానంలో నిలిచినా.. స్వర్ణం కొల్పోయిన అథ్లెట్‌?

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భాగంగా సెప్టెంబర్‌ 1న నిర్వహించిన షాట్‌పుట్‌ ఎఫ్‌20 క్లాస్‌ పోటీల్లో మలేసియా చెందిన ముహమ్మద్‌ జియాద్‌ జుల్‌కెఫ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.
Muhammad Ziyad Zolkefli

అయితే పోటీలు జరిగే వేదిక వద్దకు జియాద్‌ ఆలస్యంగా వచ్చాడని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్‌ జట్టు ఫిర్యాదు చేసింది. అధికారిక ప్రకటన తర్వాత జియాద్‌ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా... ఏదో తగిన కారణం ఉంటుందని భావించిన నిర్వాహకులు అతడిని అనుమతించారు. పోటీల అనంతరం విచారణ చేయగా... సరైన కారణం లేకుండానే జియాద్‌ ఆలస్యంగా వచ్చాడని తేలింది. దీంతో వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ కమిటీ... జియాద్‌ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అతని పేరు వద్ద డిడ్‌ నాట్‌ స్టార్ట్‌ (డీఎన్‌ఎస్‌) అని పెట్టేసింది. ఈ ఈవెంట్‌లో స్వర్ణ, రజతాలు ఉక్రెయిన్‌కు దక్కగా, గ్రీస్‌ అథ్లెట్‌ మూడో స్థానంలో నిలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020 షాట్‌పుట్‌ ఎఫ్‌20 క్లాస్‌ పోటీల్లో తొలి స్థానంలో నిలిచినా.. స్వర్ణం కొల్పోయిన అథ్లెట్‌?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 1
ఎవరు    : ముహమ్మద్‌ జియాద్‌ జుల్‌కెఫ్లీ
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
ఎందుకు : పోటీలు జరిగే వేదిక వద్దకు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందు వల్ల...
 

Published date : 02 Sep 2021 05:48PM

Photo Stories