Pramod Bhagat: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
టోక్యోలో సెప్టెంబర్ 4న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ ప్రమోద్ 21–14, 21–17తో రెండో సీడ్ డానియెల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్... 2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టి ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం.
మనోజ్ సర్కార్‌కు కాంస్యం...
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్–3 విభాగంలోనే భారత్‌కు చెందిన మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల మనోజ్ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితుడైన మనోజ్ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు?
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ప్రమోద్ భగత్
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్–3 విభాగం ఫైనల్లో టాప్ సీడ్ ప్రమోద్ 21–14, 21–17తో రెండో సీడ్ డానియెల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించినందున...