Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన కృష్ణ నాగర్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
టోక్యో వేదికగా 2021, సెప్టెంబర్ 5న జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన కృష్ణ నాగర్ 21–17, 16–21, 21–17తో చు మన్ కాయ్ (హాంకాంగ్)పై గెలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌కి చెందిన కృష్ణ... రెండేళ్లపుడే వయసుకు తగ్గట్టుగా పెరగడని(ఎదగలేని వైకల్యం) నిర్ధారించారు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ 14 ఏళ్ల వయసులో షటిల్ వైపు దృష్టి మరల్చాడు. ఎస్‌హెచ్–6 పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా ఎదిగాడు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం సాధించాడు. 2020 ఏడాది బ్రెజిల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో రన్నరప్‌గా (రజతం) నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్‌లో సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో పారాలింపిక్స్–2020లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు?
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కృష్ణ నాగర్
ఎక్కడ : టోక్యో, భారత్
ఎందుకు : బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్–6 కేటగిరీ ఫైనల్లో కృష్ణ 21–17, 16–21, 21–17తో చు మన్ కాయ్ (హాంకాంగ్)పై గెలిచినందున...