Skip to main content

Praveen Kumar: పారాలింపిక్స్‌ హైజంప్‌ టి64 కేటగిరీలో రజతం సాధించిన అథ్లెట్‌?

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించాడు.
praveenkumar-tokyoparalympics

 విశ్వ క్రీడల్లో భాగంగా సెప్టెంబర్‌ 3న జరిగిన పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ టి64 కేటగిరీ పోటీల్లో 18 ఏళ్ల ప్రవీణ్‌... 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్‌ అన్నాడు. జొనాథన్‌ బ్రూమ్‌ ఎడ్వర్డ్స్‌ (బ్రిటన్‌–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్‌–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు.

‘షూట్‌ ఆఫ్‌’లో సూపర్‌...
టోక్యో పారాలింపిక్స్‌–2020లో భాగంగా జరిగిన ఆర్చరీ పోటీల్లో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకం గెలిచాడు. 2021, సెప్టెంబర్‌ 3న జరిగిన పురుషుల రికర్వ్‌ ఓపెన్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో... దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ మిన్‌ సుపై హర్వీందర్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో 10–8తో నెగ్గాడు. దీంతో విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా హర్వీందర్‌ చరిత్ర సృష్టించాడు. హరియాణాలోని కైథాల్‌ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హర్వీందర్‌ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020 హైజంప్‌ టి64 కేటగిరీలో రజతం సాధించిన భారత అథ్లెట్‌?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 3, 2021
ఎవరు    : ప్రవీణ్‌ కుమార్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
ఎందుకు  : హైజంప్‌ టి64 కేటగిరీలో 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచినందున...
 

Published date : 04 Sep 2021 06:39PM

Photo Stories