Skip to main content

Free Training: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌ రూరల్‌: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కోసం బీసీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధిశాఖ అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
BC Development Officer Rajalingu and BC Study Circle Center Director Praveen Kumar at a press conference  BC skill development training application invitation  Invitation of applications for Skill Development Training  Announcement poster for skill development training for unemployed youth

సెప్టెంబర్ 1నుంచి నవంబర్‌ 30వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కుషాయిగౌడ ఎల్‌జీ హోప్‌ టెక్నికల్‌ స్కిల్‌ అకాడమీ ద్వారా 100 మంది అభ్యర్థులకు నాన్‌ రెసిడెన్షియల్‌ ఫ్రీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం కింద శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్‌ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Career Guidance: పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన

శిక్షణ కాలంలో నెలకు రూ.4వేల చొప్పున స్టైఫండ్‌ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 18–25 ఏళ్లుండి ఎస్సెస్సీ, ఇంటర్‌ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వా రు ఈ నెల 8నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 08732 221280 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Published date : 09 Aug 2024 11:37AM

Photo Stories