Skip to main content

Thailand Open 2024: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత‌గా సాత్విక్‌-చిరాగ్ జోడీ

థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అద్భుత విజయం సాధించింది
Satwiksairaj Rankireddy-Chirag Shetty Crowned Thailand Open Mens Doubles Champions

మే 19వ తేదీ జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యి జోడీపై 21-15, 21-15 తేడాతో ఘనంగా విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్‌, చిరాగ్ జోడీ తమ 9వ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ప్రపంచ నంబర్ 3 స్థానంలో ఉన్న ఈ భారత జోడీ, మొదటి నుండి చివరి వరకు తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఒక్కసారి కూడా ప్రత్యర్థి జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌లలో విజయం సాధించింది.

ఈ టైటిల్ విజయం, పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్‌, చిరాగ్ జోడికి మరింత ఊపునిస్తుంది. గత మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ జోడీ, మలేషియా సూపర్ 1000, ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది.

 

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్!!

Published date : 21 May 2024 03:23PM

Photo Stories