Skip to main content

WPL 2023: ఆర్‌సీబీ మెంటార్‌గా సానియా మీర్జా

హైదరాబాదీ టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా రాకెట్‌ వీడాక క్రికెట్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టనుంది.
Sania Mirza

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్ టోర్నీలో తలపడే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మెంటార్‌గా ఆమెను నియమించారు. ఈ సందర్భంగా  ‘ఆర్‌సీబీ మహిళల జట్టులో భాగమవడం సంతోషంగా ఉంది. రిటైర్మెంట్‌ అనంతరం మరో పాత్ర పోషించేందుకు ఈ జట్టు, బ్రాండ్‌ నా దృక్పథానికి సరిగ్గా సరిపోతుంది. డబ్ల్యూపీఎల్‌తో అమ్మాయిల క్రికెట్‌ మరో దశకు చేరుతుంది’ అని ఆరు గ్రాండ్‌స్లామ్‌ (డబుల్స్‌) టైటిల్స్‌ విజేత సానియా తెలిపింది.
ఆమె వచ్చే వారం దుబాయ్‌ ఈవెంట్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న ఆ్రస్టేలియాకు చెందిన బెన్‌ సాయెర్‌కు ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగించారు. సహాయ కోచ్‌గా మలోలన్‌  రంగరాజన్, ఫీల్డింగ్‌ కోచ్‌గా వనిత, బ్యాటింగ్‌ కోచ్‌గా ఆర్‌ఎక్స్‌ మురళీలను నియమించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)

Published date : 16 Feb 2023 03:46PM

Photo Stories