Skip to main content

WPL: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను నియమించారు.
Harmanpreet Kaur

భారత కెప్టెన్‌ అయిన హర్మన్‌ప్రీత్‌ ఇటీవల టి20 ప్రపంచకప్‌ సందర్భంగా 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆధ్వర్యంలో డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది. లీగ్‌ తొలి రోజు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఆడుతుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Published date : 02 Mar 2023 12:41PM

Photo Stories