Formula One Race: రష్యా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
2021 ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో 15 రేసు ‘‘రష్యా గ్రాండ్‌ప్రి’’లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. రష్యాలోని సోచిలో సెప్టెంబర్ 26న జరిగిన ఈ రేసులో 53 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్ గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేసి చాంపియన్‌గా అవతరించాడు. దీంతో హామిల్టన్ తన కెరీర్‌లో 100వ రేసు విజయాన్ని అందుకున్నాడు. రెండో స్థానంలో వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్)... మూడో స్థానంలో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) నిలిచారు.
బిగ్‌బాష్ లీగ్ ఏ క్రీడకు సంబంధించింది?
మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ డిఫెండింగ్ చాంపియన్ ‘సిడ్నీ థండర్’ తరఫున ఆడనున్నారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ప్లేయర్లు హీతర్ నైట్, టామీ బీమండ్ స్థానాల్లో వీరికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా దేశానికి చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్‌ను 2011 ఏడాదిలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది.
చదవండి: ఒస్ట్రావా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జోడి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రష్యా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : సోచి, రష్యా